టాలీవుడ్ హీరో రవితేజ (Ravi Teja) ప్రస్తుతం త్రినాథరావు నక్కిన (Trinadha Rao Nakkina) దర్శకత్వంలో చేస్తున్న చిత్రం ధమాకా (Dhamaka). తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్త అప్ డేట్ ఒకటి తెరపైకి వచ్చింది. ఈ చిత్రంలో పెళ్లి సందD ఫేం శ్రీలీల (Sreeleela) హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రవితేజ, శ్రీలీలపై వచ్చే రొమాంటిక్ సాంగ్‌ను డైరెక్టర్ అండ్ టీం చిత్రీకరిస్తుంది. స్పెయిన్‌లోని ప్రపంచ ప్రఖ్యాత చారిత్రక ప్రదేశం ప్లాజా డె ఎస్పనలో పాటను చిత్రీకరిస్తున్నారు.
లొకేషన్లో రవితేజ, శ్రీలీల, కొరియోగ్రాఫర్ భాస్కర్, డైరెక్టర్ అండ్ టీం కలిసి దిగిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. మరియా లూయిసా పార్క్ లోని బ్యూటీఫుల్ లొకేషన్లో రొమాంటిక్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఇప్పటికే ఫైట్ మాస్టర్ రామ్-లక్ష్మణ్ (Ram Lakshman) నేతృత్వంలో పలు యాక్షన్ సీన్లను చిత్రీకరించారు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Mass Maharaja @RaviTeja_offl's #Dhamaka⚡new schedule begins in Spain
Songs will be shot in this schedule on a Lavish Scale
One of them will be shot at the Historic Place ‘Plaza de España’@sreeleela14 @TrinadharaoNak1 @vishwaprasadtg @peoplemediafcy @Vivekkuchibotla pic.twitter.com/KHR6bJ2GBD
— BA Raju's Team (@baraju_SuperHit) March 16, 2022
ధమాకా చిత్రానికి భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తుండగా..కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్. త్వరలోనే విడుదల తేదీపై మేకర్స్ ఓ క్లారిటీ ఇవ్వనున్నారు. రవితేజ మరోవైపు రామారావు ఆన్ డ్యూటీ , సుధీర్ వర్మ డైరెక్షన్లో రావణాసుర సినిమాల్లో నటిస్తున్నాడు.