Samantha | సమంతకు ఇన్స్పిరేషన్ ఎవరో తెలుసా
Samantha | ప్రతి ఒక్కరికీ ఓ స్ఫూర్తిప్రదాత ఉంటారు. ఆ వ్యక్తి నడవడిక, మాటతీరు, ఆలోచనా విధానం, సంక్షోభ సమయాల్లో కనబరిచే నిబ్బరం.. అన్నీ మనకు పాఠాల్లా అనిపిస్తాయి. టాలీవుడ్ క్వీన్ సమంతనూ ఒకరు అపారంగా ప్రభావితం చేస్తున్నారు. ఆ అదృష్టవంతురాలి గురించి ఆంగ్ల పత్రిక ‘ఫెమీనా’లో సమంత పంచుకున్న ఉద్వేగపూరిత జ్ఞాపకాలు..

‘నా బలం, నా ధైర్యం, నా అలుపెరగని పోరాటానికి స్ఫూర్తి.. డైరెక్టర్ నందిని రెడ్డి. తన అవధులు లేని ప్రేమతో నన్ను నిత్యం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సినీ పరిశ్రమలో దర్శకురాలు అనిపించుకోవడం అంత సులభం కాదు. కానీ ఆ స్థాయికి ఆమె అవలీలగా చేరుకున్నది. నందిని ఎట్టి పరిస్థితిలోనూ ఓటమిని అంగీకరించదు. ఆమెనెప్పుడూ వైరాగ్యం ఆవహించదు. తనకు నిరుత్సాహం అంటేనే తెలియదు. చుట్టుపక్కల వారికి సంతోషాన్ని పంచుతూనే ఉంటుంది. అందుకే ఆ వ్యక్తిత్వానికి ఫిదా అయ్యాను.

నా జీవితంలో, కెరీర్లో తను ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నది. నేను ఎంచుకునే సినిమాలు, పోషించే పాత్రలు, వినే కథలు ప్రతీది క్షుణ్నంగా పరిశీలిస్తుంది. తనకున్న అనుభవంతో నేను ఎలా ఉండాలో, ఎలా పనిచేయాలో చెబుతుంది. ఎక్కడున్నా, ఏంచేస్తున్నా.. నాకు కేవలం ఫోన్ కాల్ దూరంలోనే ఉంటుంది. కష్ట సమయాల్లో అండగా నిలిచింది. ఆరోగ్యం బాగాలేనప్పుడు.. రోజూ వచ్చి పరామర్శించేది. మాటలతో నన్ను ఉత్సాహపరిచేది. అందుకే, నందిని అంటే నాకు చాలా ఇష్టం.
మా ఇద్దరి అలవాట్లు, ఆలోచనా విధానం ఒకేలా ఉంటాయి. మా ఇద్దరికీ ఎంచుకున్న వృత్తి పట్ల అపార గౌరవం. మేం పనిని చాలా సీరియస్‌గా తీసుకుంటాం. చేపట్టిన ప్రతి ప్రాజెక్ట్‌నూ శ్రద్ధతో చేస్తాం. విజయవంతం చేయడానికి వందశాతం కృషిచేస్తాం. ఆమె నుంచి నేను ఎంతో నేర్చుకున్నాను. గురువుగా, స్నేహితురాలిగా నందిని లభించడం నా అదృష్టం.
Read More :
Samantha | స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న సామ్..దేనికోసమంటే!”
“అదొక్కటే గుర్తుపెట్టుకున్నారు!”..ఎమోషనల్ అయిన సమంత
Samantha | గ్రీన్ కలర్ డ్రెస్‌లో సమంత అందాలు అదరహో..”
“Samantha | కమర్షియల్ బ్రేక్ కోసం సమంత తీవ్ర ప్రయత్నాలు..!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

