Devara 2 | ఓ వైపు ‘వార్ 2’.. మరోవైపు ప్రశాంత్‌నీల్ ‘డ్రాగన్'(వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు తారక్. ‘వార్ 2’ ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల కానుంది. ఇక ప్రశాంత్‌నీల్ సినిమా అయితే.. విడుదల వచ్చే ఏడాదే. ఇదిలావుంటే.. ఈ ఏడాది చివరి నుంచి ‘దేవర 2’కు కూడా తారక్ డేట్స్ ఇచ్చేశారని ఫిల్మ్ వర్గాల టాక్. అందుకే.. ప్రశాంత్‌నీల్ సినిమాకు సంబంధించిన తన వర్క్ మొత్తాన్ని డిసెంబర్‌లోపు కంప్లీట్ చేయాలనే సంకల్పంతో తారక్ ముందుకెళ్తున్నారట.
దీనికి సంబంధించి, ప్రశాంత్‌నీల్‌తో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారట. డిసెంబర్‌లోపు ‘డ్రాగన్’ సినిమాకు సంబంధించిన తన పార్ట్‌ని కంప్లీట్ చేసి, ‘దేవర2’ సెట్లోకి ఎంట్రీ ఇస్తారట ఎన్టీఆర్. ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ ‘దేవర 2’ స్క్రిప్ట్ వర్క్, ప్రీప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తున్నది. డిసెంబర్ కల్లా ‘దేవర 2’ షూటింగ్ మొదలుపెట్టేందుకు సర్వసన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సెకండ్ పార్ట్‌లో కథానాయిక జాన్వీ కపూర్ పాత్ర కీలకంగా ఉంటుందని తెలుస్తున్నది. అనిరుథ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.