Devara Movie Trailer | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ (Devara). జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కాంబోలో ఈ సినిమా రానుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
విడుదల తేదీ దగ్గర పడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్‌తో పాటు సెకండ్ సింగిల్ చుట్టమల్లే.. థర్డ్ సింగిల్ దావుడి పాటలను విడుదల చేయగా.. ఈ మూడు పాటలు యూట్యూబ్‌లో దూసుకుపోతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ అప్డేట్ను పంచుకున్నారు మేకర్స్. ఈ మూవీ ట్రైలర్‌ను సెప్టెంబర్ 10న విడుదల చేయనున్నట్లు దేవర టీం ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్ ఈవెంట్‌ను ముంబైలో భారీ ఎత్తున్న ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
Celebrate today 🔥
Conquer in a couple of days ❤️Face your fears head on from September 10th with #DevaraTrailer 💥#Devara #DevaraOnSep27th pic.twitter.com/jowyODJPXB
— Devara (@DevaraMovie) September 7, 2024