ప్రకటన నాటినుంచి నేటి ప్రమోషన్స్ వరకూ ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ ‘దేవర-1’పై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతూనే ఉన్నాయి. రీసెంట్గా విడుదల చేసిన ‘చుట్టమల్లె..’ సాంగ్ వ్యూస్ ఇప్పటికే కోటి దాటిపోయాయి. కొరటాల శివ ప్రెస్టేజియస్గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. వివక్షకు, అణచివేతకు గురవుతున్న తనవారికి అండగా నిలబడి, ధర్మసంస్థాపన చేసిన ఓ ధీరోదాత్తుని కథగా ‘దేవర’ను కొరటాల శివ రూపొందిస్తున్నారు.
తీరప్రాంత నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం తొలి భాగం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. వచ్చే నెల 27న సినిమా విడుదల కానుంది. జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సైఫ్ ఆలీఖాన్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుథ్, నిర్మాతలు: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్‌రామ్.