Devara Movie | ఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం దేవర. ఈ సినిమా ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆరేండ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా రావడంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ దేవర సినిమా చూసి సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ సినిమా సాధించిన విజయం పట్ల దేవర టీం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు దర్శకుడు కొరటాల శివతో పాటు నటుడు నందమూరి కళ్యాణ్ రామ్, నిర్మాత దిల్ రాజు తదితరులు హాజరయ్యారు.
ఇక ఈ ఈవెంట్లో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. నాలుగేళ్లు మేం అందరం పడిన కష్టం ఈ దేవర. ఈరోజు మీ ముందుకు వచ్చింది. ఈ సినిమాపై మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలకు ఇస్తున్న రికార్డు బ్రేకింగ్ కలెక్షన్స్‌కు మా ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం టీమ్ ఎంతో కష్టపడి పనిచేసింది. దేవర వరల్డ్‌ను సాబ్ సిరిల్‌కు ధన్యవాదాలు. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశాడు. యాక్టింగ్‌తో అదరగొట్టేశాడు. ఇది వన్ మ్యాన్ షో అని గర్వంగా చెప్పగలను. ఈ సినిమా ఇంతటి విజయం సాధించినందుకు టీమ్‌కు థాంక్యూ అంటూ కళ్యాణ్ రామ్ చెప్పుకోచ్చాడు.
#Devara Success Press Meet#NandamuriKalyanram #KoratalaSiva #DilRaju pic.twitter.com/khruNKb7Eu
— Vamsi Kaka (@vamsikaka) September 27, 2024