Devara Movie | ఎన్టీఆర్ కథానాయకుడిగా, కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం దేవర. ఆరేండ్ల తర్వాత ఎన్టీఆర్ సోలోగా రావడంతో అటు ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్‌లో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా మొదటిరోజే నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.
వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ రోజే రూ. 172 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదే జోరును చూపించింది. రెండో రోజు ఏకంగా రూ.71 కోట్ల వసూళ్లను రాబట్టింది. దీంతో రెండు రోజుల్లో రూ.243 కోట్లు వసూళ్లను సాధించింది. ఈరోజు అదివారం హాలీడే కావడం దసరా సెలవులు వస్తుండటంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సినిమాలో జాన్వీకపూర్ కథానాయికగా నటించగా. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటించాడు. నందమూరి కల్యాణ్‌రామ్ సమర్పించగా.. మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె సంయుక్తంగా నిర్మించారు.
Weapons of DESTRUCTION…….
unleashing FEAR that no corner can hide from!! 🔥🔥🔥#Devara #BlockbusterDevara pic.twitter.com/hhrT5g5ZU0— Devara (@DevaraMovie) September 29, 2024