Devara Movie | మరో 10 రోజుల్లో ‘దేవర’ సందడి షురూ కానున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత వీర రాఘవ’ వంటి బ్లాక్ బస్టర్ తరువాత ఎన్టీఆర్ సోలోగా వస్తుండటంతో ఈ మూవీపై ఇటు టాలీవుడ్‌తో పాటు పాన్ ఇండియా వైడ్‌గా భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ఓవర్సీస్లో బుకింగ్స్ స్టార్ట్ అవ్వగా 5 లక్షలకు పైగా టికెట్స్ బుక్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు.
ఇదిలావుంటే తాజాగా ఈ మూవీ నైజాం థియేటర్లకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమాను నైజాంలో విడుదల ముందు రోజు మిడ్ నైట్ బెనిఫిట్ షోలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా టికెట్లను రూ.1000 నుంచి రూ.5000 వరకు అమ్మనున్నట్లు థియేటర్ యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఆరేండ్ల తర్వాత తారక్ సోలోగా వస్తుండటంతో ఆ మాత్రం పెట్టడం తప్పు కాదంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. కాగా దీనిపై చిత్రబృందం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.