Devara Midnight Shows | ఎన్టీఆర్ అభిమానులంతా ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఆరేండ్లుగా ఆకలితో ఉన్న తారక్ అభిమానులకు దేవర ఫుల్ పెట్టాబోతుందని చెప్పడంలో సందేహమే లేదు. యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమా ఎలా ఉంటుందని ఇప్పటికే టాలీవుడ్‌తో పాటు ప్రపంచమంతా ఎదురుచూస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాను మిడ్ నైట్ 1 గంటలకు స్పెషల్ షో వేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దీనికి సంబంధించిన టికెట్లు కూడా అమ్ముడయిపోయాయి. అయితే 1 గంటల షోల పరంగా ఈ సినిమా అరుదైన రికార్డును అందుకోనుంది. దాదాపు 500 పైగా థియేటర్లలో ఈ సినిమాను అర్ధరాత్రి 1 గంటలకు స్పెషల్ షో వేయనున్నట్లు సమాచారం. దీంతో ఈ రికార్డు అందుకున్న తొలి నటుడిగా తారక్ చరిత్ర సృష్టించనున్నాడు.
మరోవైపు ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు 10 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయినట్లు సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్, కలైయరసన్, అజయ్ మరియు అభిమన్యు సింగ్ కూడా కీలక పాత్రలలో నటించారు.
మరోవైపు హైదరాబాద్‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా అరుదైన రికార్డు అందుకుంది. ఒక్కరోజే ఏకంగా 42 షోలు ప్రదర్శించబోతున్నట్లు ప్రసాద్స్ సినిమాస్ తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ రికార్డు మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాపై ఉంది. గుంటూరు కారం సినిమా 41 షోలు ప్రదర్శించబడింది.
Aggantukundhi Sandhram 🔥🔥🤙🏻🤙🏻
That’s his usual way of waving at records and steals yet another – 42 shows on Day 1! 💥💥
1 AM shows open the doors for Mass Hysteria! ❤️🔥❤️🔥#Devara #DevaraOnSep27th @DevaraMovie pic.twitter.com/9VRTKHaak8
— Prasads Multiplex (@PrasadsCinemas) September 26, 2024