Devara 2 Movie | నందమూరి తారక్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘దేవర 2’ చిత్రంపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలువడింది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ పూర్తికాగానే, ‘దేవర 2’ సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
దేవర చిత్రం విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ మూవీ పార్ట్ 2కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ప్రస్తుతం దర్శకుడు కొరటాల శివ తీరిక లేకుండా గడుపుతున్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ వస్తున్న వార్తల ప్రకారం ‘దేవర 2’ షూటింగ్ వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మొదటి భాగం హిట్ అయిన నేపథ్యంలో, రెండో భాగం కూడా అంతే స్థాయిలో అలరిస్తుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తారక్ కెరీర్లోనే మరో మైలురాయిగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.