Galla Ashok | మహేశ్‌బాబు మేనల్లుడు గల్లా అశోక్ కథానాయకుడిగా రూపొందిన ‘దేవకీ నందన వాసుదేవ’ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. మానస వారణాసి కథానాయిక. ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌వర్మ కథతో, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. సోమినేని బాలకృష్ణ నిర్మాత. మొదట ఈ సినిమాను ఈ నెల 14న విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ కొన్ని కారణాల వల్ల వారం ఆలస్యంగా అంటే.. ఈ నెల 22న సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.
దైవకోణంలో సాగే ఈ కుటుంబకథలో యాక్షన్ ప్రధానంగా ఉంటుందని, అశోక్ గల్లా అభినయం, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు, అర్జున్ జంధ్యాల దర్శకత్వం సినిమాకు ప్రధాన బలాలుగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు. శంకర్ పిక్చర్స్ సంస్థ ద్వారా విడుదల అవుతున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, రసూల్ ఎల్లోర్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సమర్పణ: నల్లపనేని యామిని.