Devaki Nandana Vasudeva | తెలుగు అగ్ర కథానాయకుడు మహేశ్ బాబు మేనల్లుడు.. ప్రముఖ పారిశ్రామికవేత్త జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా (Ashok Galla) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవకీ నందన వాసుదేవ (Devaki Nandana Vasudeva). జాంబిరెడ్డి, హనుమాన్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ వర్మ (Prashanth Verma) ఈ చిత్రానికి కథనందిస్తుండగా.. గుణ 369 ఫేం అర్జున్ జంధ్యాల (Arjun Jandyala) దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇదే రోజున టాలీవుడ్ నుంచి వరుణ్ తేజ్ మట్కాతో పాటు కోలీవుడ్ నుంచి సూర్య కంగువ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. దీంతో రెండు పెద్ద సినిమాల మధ్య ఈ సినిమా విడుదల కానుడటంతో మూవీపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని భావించిన మేకర్స్ తాజాగా మూవీ వారం రోజులకు వాయిదా వేశారు. ఈ సందర్భంగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఈ సినిమాను నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు.
ఈ సినిమాలో అశోక్ గల్లా సరసన హీరోయిన్గా మాజీ మిస్ ఇండియా (2020) మానస వారణాసి (Manasa Varanasi) నటిస్తుంది. నల్లపనేని యామిని సమర్పణలో లలితాంబికా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోమినేని బాలకృష్ణ (ఎన్ఆర్ఐ) ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు అందిస్తుండగా.. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్ కాగా తమ్మిరాజు ఎడిటర్. ఇక కార్తికేయ హీరోగా అర్జున్ జంధ్యాల చివరగా డైరెక్ట్ చేసిన గుణ 369 బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సారి ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని చూస్తున్నాడు అర్జున్ జంధ్యాల.
A divine delay for a divine experience ❤️🔥✨️
Mark your calenders and get ready to be enchanted,#DevakiNandanaVasudeva is RELEASING ON NOVEMBER 22nd 📽#DNVonNov22 🤩@AshokGalla_ @varanasi_manasa @ArjunJandyala @PrasanthVarma @DevdattaGNage @getupsrinu3 #RasoolEllore… pic.twitter.com/pUjuMBntcM
— BA Raju’s Team (@baraju_SuperHit) November 9, 2024