Devagudi Success | పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం “దేవగుడి”. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయానందాన్ని పంచుకోవడానికి చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో గ్రాండ్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, సినిమాకు మద్దతు తెలిపిన మీడియాకు, విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడా ల్యాగ్ లేకుండా సాగే గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయని పేర్కొన్నారు. యాక్షన్ సీక్వెన్సులు, పాటల చిత్రీకరణపై ప్రశంసలు వస్తున్నాయని, ముఖ్యంగా రఘు కుంచె చేసిన వీరారెడ్డి పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీల నటన ఆడియన్స్‌ను కట్టిపడేస్తోందని, థియేటర్ల నుండి ప్రేక్షకులు భావోద్వేగంతో బయటకు వస్తుండటం తమ టీమ్‌కు ఎంతో సంతృప్తిని ఇస్తోందని అన్నారు.
హీరో అభినవ్ శౌర్య మాట్లాడుతూ, హీరో కావాలనే తన కల ఈ సినిమా స్పందనతో నెరవేరిందని ఎమోషనల్ అయ్యారు. రివ్యూల్లో తనను ‘ధర్మ’ (పాత్ర పేరు) అని సంబోధించడం ఆనందంగా ఉందని, తనకు నటుడిగా జన్మనిచ్చిన రామకృష్ణారెడ్డి గారికి ఈ క్రెడిట్ దక్కుతుందని అన్నారు. జాతర నేపథ్యంలో వచ్చే భారీ యాక్షన్ సీక్వెన్స్‌కు విశేష స్పందన వస్తోందని తెలిపారు. మరో నటుడు నరసింహ తోషి మాట్లాడుతూ, ఒక మంచి పాత్రలో నటించే అవకాశం రావడం, సినిమా విజయం సాధించడంతో తమ కుటుంబ సభ్యులు, స్నేహితుల నుండి ప్రశంసలు అందుతున్నాయని చెప్పారు.
ప్రముఖ నటుడు రఘు కుంచె మాట్లాడుతూ, మంచి కంటెంట్ ఉంటే తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ఆదరిస్తారని ఈ సినిమా మరోసారి నిరూపించిందన్నారు. చిన్న సినిమాను సరైన ప్లానింగ్‌తో పబ్లిసిటీ చేసి జనాల్లోకి తీసుకెళ్లిన రామకృష్ణారెడ్డి గారి కృషిని అభినందించారు. వీరారెడ్డిగా తాను చేసిన పాత్ర తన కెరీర్లో అత్యుత్తమ పాత్రగా నిలిచిపోయిందని పేర్కొన్నారు.
హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ, తెలుగు అమ్మాయిగా ‘శ్వేతారెడ్డి’ పాత్రతో ప్రేక్షకులకు దగ్గరయ్యానని, తన ఫైట్ సీక్వెన్స్ మరియు పవర్ఫుల్ డైలాగ్స్‌కు థియేటర్లలో విజిల్ పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.
అభినవ శౌర్య, నరసింహ తోషి, అను శ్రీ, రఘు బాబు, అన్నపూర్ణమ్మ, రఘు కుంచె, రాకెట్ రాఘవ, ఆర్ఎక్స్ 100 లక్ష్మణ్, ఇమ్మానియేల్, ప్రభావతి, రాజశ్రీ నాయర్ వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి ఎస్.కె మదీన్ సంగీతం, లక్ష్మీకాంత్ కనిక ఛాయాగ్రహణం అందించారు.