మహేష్‌బాబు మేనల్లుడు అశోక్ గల్లా కథానాయకుడిగా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్నది. ప్రశాంత్‌వర్మ కథనందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘ఆదిపురుష్’ ఫేమ్ దేవదత్త నాగే కంసరాజు అనే పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. శనివారం ఆయన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆయన చేతిలో కత్తి పట్టుకొని కోపోద్రిక్తుడై కనిపిస్తున్నారు. ‘భాగవతంలోకి ఓ ఘట్టాన్ని నేటి కాలానికి అన్వయిస్తూ రూపొందిస్తున్న చిత్రమిది. కథ, కథనాలు కొత్తదనంతో ఆకట్టుకుంటాయి. అశోక్ గల్లా పాత్ర నవ్యరీతిలో సాగుతుంది’ అని చిత్రబృందం పేర్కొంది. వారణాసి మానస కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, దర్శకత్వం: అర్జున్ జంధ్యాల.