ప్రభాస్ పాన్ ఇండియా చిత్రం ‘కల్కి 2898’ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జూన్ 27న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాకు సంబంధించిన సరికొత్త అప్డేట్స్ అభిమానుల్లో జోష్ని నింపుతున్నాయి. కొద్ది రోజుల కిత్రం విడుదల చేసిన బుజ్జి వాహనం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఈ చిత్రంలో ప్రభాస్ భైరవగా, అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రలో కనిపించనున్నారు. అయితే కథానాయిక దీపికా పడుకోన్ పాత్ర తాలూకు ఏ విషయాన్ని ఇప్పటివరకు చిత్ర బృందం పంచుకోలేదు. దాంతో ఆమె క్యారెక్టర్ గురించి అభిమానుల్లో క్యూరియాసిటీ ఎక్కువవుతున్నది. ఈ నేపథ్యంలో దీపికా పడుకోన్ పాత్ర గురించి ఓ ఆసక్తికరమైన అప్డేట్ బయటికొచ్చింది.
ఈ సినిమాలో ఆమె పునర్జన్మ పొందిన లక్ష్మీదేవి పాత్రలో కనిపించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె పేరు పద్మ అని చెబుతున్నారు. విష్ణుమూర్తి పదో అవతారమైన ‘కల్కి’ అంశం ప్రధానంగా సోషియో ఫాంటసీ సైంటిఫిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీపికా పడుకోన్ పాత్రపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నాగ్అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.