Deputy CM Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులోని మధురైకి చేరుకున్నారు. మధురైలో మురుగ భక్తర్గళ్ మానాడు జరుగుబోతుండగా.. ఇందులో పాల్గోనడం కోసం మధురై వెళ్లాడు పవన్. ఆదివారం మధ్యాహ్నం మధురై విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు నైనార్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఇతర తమిళనాడు బీజేపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈరోజు సాయంత్రం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం, అమ్మ తిడల్ ప్రాంగణంలో జరగనున్న మానాడులో పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు.
మధురై చేరుకున్న శ్రీ @PawanKalyan గారు
మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మధురై చేరుకున్నారు. ఆదివారం మధ్యాహ్నంవమధురై విమానాశ్రయంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @NainarBJP, తమిళనాడు… pic.twitter.com/XlBmm56KqL
— JanaSena Party (@JanaSenaParty) June 22, 2025