Pawan Kalyan | ఆంధ్రప్రదేశ్లోని కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుని నేడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరమర్శించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నాడు. కుటుంబానికి అన్నివిధాలా అండగా ఉంటానని మాటిచ్చాడు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్సీపీపై విమర్శలు గుప్పించాడు. అయితే పవన్ మీడియాతో సీరియస్గా మాట్లాడుతుండగా.. అతని అభిమానులు చేసిన పనికి అసహానం వ్యక్తం చేశాడు.
ఎంపీడీఓ దాడి ఘటనపై పవన్ మాట్లాడుతుంటే.. అతని అభిమానులు ఓజీ.. ఓజీ.. ఓజీ.. సీఎం.. సీఎం అని పిలవడం మొదలుపెట్టారు. దీంతో అసహనానికి గురైన పవన్ కళ్యాన్.. అభిమానులను ఉద్దేశించి.. మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా అయ్యా.. పక్కకి వెళ్లండి అంటూ అసహ్యించుకున్నాడు. కాగా.. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది.
గాలివీడు ఎంపీడీఓ శ్రీ జవహర్ బాబును పరామర్శించడానికి వెళ్ళిన పవన్.
అభిమానులు : ఓజీ… ఓజీ… ఓజీ…
పవన్ : మీకు ఎక్కడ ఏం స్లోగన్ ఇవ్వాలో కూడా తెలియకపోతే ఎలా అయ్యా! #PawanKalyan pic.twitter.com/bJXFiOGtLa
— Gulte (@GulteOfficial) December 28, 2024