Pawan Kalyan – Prakashraj | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్‌ల మధ్య డైలాగ్ వార్ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం (Tirupati Laddu Issue) నేపథ్యంలో ఈ ఇద్దరు యాక్టర్లు ఎవరి స్టైల్లో వాళ్లు పంచ్ వేస్తూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నారు. తన పోస్ట్‌ను పవన్ కళ్యాణ్ తప్పుగా అర్థం చేసుకున్నాడని ప్రకాశ్ రాజ్ వీడియో పెట్టిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పవన్ కళ్యాణ్ స్పందించాడు. ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదు మిత్రుడే అంటూ చేప్పుకోచ్చాడు.
వ్యక్తిగతంగా ప్రకాశ్‌రాజ్ అంటే నాకు చాలా ఇష్టమని.. నాకు మంచి స్నేహితుడు కూడా. రాజకీయంగా మాకు భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంది. నటుడిగా ఆయన్ని గౌరవిస్తా. ఆయనతో కలిసి వర్క్ చేయడం నాకెంతో ఇష్టం. అయితే తిరుమల లడ్డూ విషయంలో ప్రకాశ్ రాజ్ స్పందిచాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా (దిల్లీలో మీ స్నేహితులంటూ) ఆయన ఆవిధంగా కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి అందుకే దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో పోస్ట్ పెట్టా. ఆయన పోస్ట్ నేను తప్పుగా అర్థం చేసుకోలేదు. ఆయన ఉద్దేశం నాకు అర్థమైంది అంటూ పవన్ చెప్పుకోచ్చాడు.
ప్రకాశ్ రాజ్ నాకు శత్రువు కాదు మిత్రుడే
ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండొచ్చు కానీ నటుడిగా ఆయనంటే నాకు గౌరవం ఉంది – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Credits – One India pic.twitter.com/CSPiVKj7T6
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2024