Delulu Movie | ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్న ‘డెలులు’ (Delulu) అనే సరికొత్త పదాన్ని ప్రధాన టైటిల్‌గా మలుచుకుని తెరకెక్కుతున్న చిత్రం ‘డెలులు’. ప్రీతం కస్తూరి దర్శకత్వంలో క్రియేటివ్ లాంచ్‌ప్యాడ్ బ్యానర్‌పై సంకీర్త్ కొండ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ టెలివిజన్, సోషల్ మీడియా మాధ్యమాలలో విశేష స్పందనను రాబట్టుకుంటూ, సినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తోంది.
దాదాపు నిమిషం ముప్పై సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుంది. ‘బ్రేకప్ దేవా’ అనే ఆసక్తికరమైన డైలాగ్‌తో ప్రారంభమయ్యే ఈ వీడియో, నేటి తరపు యువత ఆలోచనలను, వారి మధ్య జరిగే సరదా గొడవలను కళ్లకు కట్టినట్లు చూపించింది. ముఖ్యంగా పాత్రల మధ్య నడిచే సంభాషణలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. టీజర్లో వినిపించే పలు డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆడదానివైన నువ్వు.. చీప్‌గా ఓ మగాడి కోసం మారతావా.. సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా నీకు?’, ‘నువ్వేమైనా ఫాదర్ ఆఫ్ ఇండియానా?’, ‘నువ్వు అత్తాపూర్‌కు రారా.. నీళ్ల ట్యాంకర్ దగ్గర ఆడోళ్లతో కొట్టిస్తా’ వంటి పదునైన, ఫన్నీ డైలాగ్స్ చిత్ర యూనిట్ సెన్సెస్ ఆఫ్ హ్యూమర్‌కి అద్దం పడుతున్నాయి.
ఈ చిత్రానికి విజయ్ రాజ్‌కుమార్ కథ అందించడంతో పాటు అదనపు సంభాషణలు రాశారు. రెష్మిత్ ఎస్. కౌశిక స్క్రీన్‌ప్లే మరియు మాటలు అందించగా, జై రాజ్ నాయుడు సినిమాటోగ్రఫీ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఇక ఆది చెబ్రోలు అందించిన నేపథ్య సంగీతం టీజర్‌లోని కామెడీ సన్నివేశాలను మరింత ఎలివేట్ చేసింది. హరికృష్ణ కురపాటి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. విజయ్ రాజ్‌కుమార్, వేణి రావు, అఖిల్ జాక్సన్, సాయి ప్రసన్న, శ్రీ రామ మండవ, అభినయ్ తుల తదితరులు నటిస్తున్న ఈ సినిమా కేవలం యూత్‌ను మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా టార్గెట్ చేసే అంశాలతో తెరకెక్కుతున్నట్లు స్పష్టమవుతోంది. వినూత్నమైన టైటిల్, దానికి తగిన కామెడీ ఎంటర్టైనర్ కథనంతో వస్తున్న ‘డెలులు’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో వేచి చూడాలి.