Vijay Deverakonda | ఢిల్లీ హైకోర్టులో విజయ్ దేవరకొండకు ఊరట.. వ్యక్తిగత హక్కులకు రక్షణ కల్పిస్తూ కోర్టు తీర్పు
VijayDeverakonda | నటుడు విజయ్ దేవరకొండకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, గొంతు మరియు ఇతర వ్యక్తిగత హక్కులను (Personality Rights) అనధికారికంగా ఇతరులు వాడకుండా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
Delhi High Court | నటుడు విజయ్ దేవరకొండకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన అనుమతి లేకుండా పేరు, ఫొటోలు, గొంతు మరియు ఇతర వ్యక్తిగత హక్కులను (Personality Rights) అనధికారికంగా ఇతరులు వాడకుండా ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), డీప్‌ఫేక్స్ మరియు ఫేస్-మార్ఫింగ్ టెక్నాలజీలను ఉపయోగించి ఆయనను అశ్లీల లేదా అసభ్యకర రీతిలో చిత్రీకరిస్తున్న కంటెంట్‌పై కోర్టు తీవ్రంగా స్పందించింది.
న్యాయమూర్తి జస్టిస్ వికాస్ మహాజన్ ఈ ఆదేశాలు జారీ చేస్తూ.. మెటా (Meta), గూగుల్ (Google), ఎక్స్ (X) వంటి సోషల్ మీడియా సంస్థలు నటుడు గుర్తించిన అక్రమ కంటెంట్, వీడియోలు, రీల్స్, పోస్టులు మరియు అకౌంట్లను వెంటనే తొలగించాలని ఆదేశించారు. అలాగే, ఆన్లైన్ మార్కెట్‌ప్లేస్‌లు సంబంధిత లింక్‌లను 72 గంటల్లోగా టేకడౌన్ చేయాలని స్పష్టం చేశారు.
విజయ్ దేవరకొండ తన పేరు (విజయ్ దేవరకొండ, విజయ్ సాయి దేవరకొండ), ‘VD’ అనే ఇనిషియల్స్, సిగ్నేచర్లు, వాయిస్ రికార్డింగ్‌లు, ఫ్యాషన్ స్టైల్, సినిమా స్టిల్స్ వంటి వాటిని వాణిజ్యపరంగా ఎవరూ దుర్వినియోగం చేయకుండా రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయనకు ఎంతో ఇష్టమైన “రౌడీ” (Rowdy) అనే పేరును కేవలం ఒంటరిగా వాడడంపై మాత్రం కోర్టు ఎక్స్-పార్టీ ఇంజంక్షన్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఆ పేరు ఆయనకు మాత్రమే ప్రత్యేకంగా చెందుతుందని నిరూపించే తగిన సాక్ష్యాధారాలు అవసరమని కోర్టు పేర్కొంది. అదే సమయంలో, “రౌడీ” అనే పదాన్ని విజయ్ ఏఐ లేదా మార్ఫ్డ్ ఇమేజ్‌లతో కలిపి వాడితే మాత్రం అది ఆయన వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని స్పష్టం చేసింది. ఈ కేసు విచారణను డిసెంబర్ 3కి మరియు తదుపరి విచారణను ఫిబ్రవరికి వాయిదా వేస్తూ, ప్రతివాదులు నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kangana Ravi Babu | కంగనా రనౌత్‌తో రవిబాబు హారర్ సినిమా.. నిర్మాతగా రానా దగ్గుబాటి, టైటిల్ ఏంటంటే..!
KTR | రైతుల బతుకులను నాశనం చేస్తున్న రేవంత్‌రెడ్డి : కేటీఆర్
KTR Tour Photos | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అడుగడుగునా నీరాజనం.. ఫోటోలు
Home Guard Killed | బహిరంగంగా మద్యం తాగడాన్ని అడ్డుకున్న హోమ్ గార్డు.. కొట్టి చంపిన ముగ్గురు వ్యక్తులు
Megaverse | చిరంజీవి ‘మెగావర్స్’ ప్రోమోకు హరీష్ శంకర్ దర్శకత్వం.. నవంబర్ 4న హైదరాబాద్‌లో ప్రత్యేక షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

