Deepthi Manne | టెలివిజన్ ప్రపంచంలో తన అందం, అభినయం, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి దీప్తి మన్నె త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. రాధమ్మ కూతురు’, ‘జగధాత్రి’* సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న దీప్తి, తన జీవితంలోని కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్లు స్వయంగా వెల్లడించింది. మొన్నటి వరకు కాబోయే భర్త ముఖాన్ని గోప్యంగా ఉంచిన దీప్తి, ఇప్పుడు సోషల్ మీడియాలో అతని ఫేస్ రివీల్ చేసింది. తన కాబోయే జీవిత భాగస్వామి పేరు రోహన్ అని ప్రకటించింది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ .. “ప్రియమైన రోహన్, నేను ఎదురు చూసిన వ్యక్తివి నువ్వే. దేవుడు ఇచ్చిన అత్యంత అందమైన బహుమతి నువ్వు. నన్ను నీ జీవిత భాగస్వామిగా ఎంచుకున్నందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను” అంటూ భావోద్వేగపూరిత క్యాప్షన్ రాసింది. జీ టీవీ కుటుంబం సాక్షిగా ఈ హ్యాపీ న్యూస్‌ను ప్రకటించిన దీప్తికి సహ నటీనటులు, సీరియల్ టీమ్ సభ్యులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు ప్రత్యేక బహుమతులు అందజేసి, వివాహ జీవితం సుఖశాంతులతో నిండాలని ఆకాంక్షించారు.
దీప్తికి తెలుగు, కన్నడ భాషల్లో విశేషమైన అభిమాన వర్గం ఉంది. కన్నడలో ‘పద్మావతి’ సీరియల్‌తో పేరు తెచ్చుకున్న ఆమె, తెలుగులో ‘రాధమ్మ కూతురు’ ద్వారా ఎక్కువ గుర్తింపు పొందింది. ప్రస్తుతం ‘జగధాత్రి’ సీరియల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. బెంగళూరుకు చెందిన దీప్తి మన్నె, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి డిగ్రీ పూర్తిచేసింది. నటనపై ఉన్న ఆసక్తితో ఆడిషన్లలో పాల్గొని తమిళ చిత్రం ‘అవాన్’ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసింది. అనంతరం ‘నమ్మూర్ హైక్‌లు’ , ‘ఇక్ సే లవ్’*, ‘దేవదాస్ బ్రదర్స్’ వంటి చిత్రాల్లో నటించి, తర్వాత టెలివిజన్ వైపు మళ్లింది. దీప్తి-రోహన్ జంట ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఈ జంటకు ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.