Deepika Padukone | రణవీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ‘ధురంధర్ 2’ సినిమా దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మొదటి భాగం కంటే ఈ సీక్వెల్ మరింత పెద్ద హిట్‌గా నిలుస్తుందనే టాక్ వినిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్‌లు, స్పై ఎలిమెంట్స్, ఊహించని ట్విస్ట్‌లతో ఈ చిత్రం ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తోంది. థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తుండగా, కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోతోంది. టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా స్టార్ హీరోలు, సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘ధురంధర్ 2’ టీమ్‌ను అభినందిస్తున్నారు. దీంతో సినిమా క్రేజ్ మరింత పెరిగింది.
అయితే ఈ విజయోత్సాహం మధ్య ఒక విషయం మాత్రం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే రణవీర్ సింగ్ భార్య, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే సైలెన్స్. సినిమా రిలీజ్‌కు ముందు గానీ, తర్వాత గానీ ఆమె ఎక్కడా ‘ధురంధర్ 2’ గురించి స్పందించలేదు. సోషల్ మీడియాలో ఒక్క పోస్టు కూడా పెట్టకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గతంలో రణవీర్ చిన్న విజయాన్ని సాధించినా కూడా వెంటనే స్పందించే దీపికా, ఇప్పుడు ఈ భారీ బ్లాక్‌బస్టర్‌పై మౌనం పాటించడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ధురంధర్’ మొదటి భాగానికి మాత్రమే స్టోరీ పెట్టిన ఆమె, పార్ట్ 2పై మాత్రం ఎలాంటి స్పందన ఇవ్వకపోవడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. “దీపికా బిజీగా ఉందా?”, “లేదా వ్యక్తిగత కారణాల వల్ల స్పందించలేదా?”, “ఇద్దరి మధ్య ఏమైనా జరిగిందా?” అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. బాలీవుడ్ మీడియాలో కూడా ఈ అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.
అయితే, దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. కొందరు మాత్రం దీపికా ప్రస్తుతం తన ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల స్పందించలేకపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మరికొందరు ఇది సాధారణ విషయమేనని, ప్రతి విజయంపై సోషల్ మీడియాలో స్పందించాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా, ఒకవైపు ‘ధురంధర్ 2’ బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను ఆస్వాదిస్తుండగా, మరోవైపు దీపికా మౌనం బాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సైలెన్స్ వెనుక అసలు కారణం ఏమిటో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.