రాకా కోసం 25కోట్లు?
డిమాండ్లు ఎక్కువ కావడంతో, చేస్తున్న సినిమాల నుంచి తొలగించబడి, ఉన్న డిమాండ్ కోల్పోయిందంటూ కొన్ని సోషల్ మీడియా వేదికలు దీపిక పదుకొణేపై వార్తలు రాశాయి.
డిమాండ్లు ఎక్కువ కావడంతో, చేస్తున్న సినిమాల నుంచి తొలగించబడి, ఉన్న డిమాండ్ కోల్పోయిందంటూ కొన్ని సోషల్ మీడియా వేదికలు దీపిక పదుకొణేపై వార్తలు రాశాయి. అయితే.. తాజాగా వినిపిస్తున్న ఓ బీటౌన్ వార్త.. దీపిక డిమాండ్ ఇసుమంత కూడా తగ్గలేదని, ఇంకా మాట్లాడితే, మరింత పెరిగిందని చెబుతున్నది.
వివరాల్లోకెళ్తే.. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పానిండియా చిత్రం ‘రాకా’లో దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో నటించినందుకు గాను ఏకంగా 25కోట్ల పారితోషికాన్ని దీపిక పదుకొణే అందుకుంటున్నదట. ఇదే ఆ వార్త సారాంశం.
భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇంత పారితోషికం తీసుకున్న హీరోయిన్ మరొకరు లేరు. ఈ వార్త వాస్తవమైతే.. నిజంగా ఇది రికార్డే. అంతేకాదు, దీపికకు డిమాండ్ తగ్గిందని వార్తలు రాసిన వాళ్లకు ఈ వార్త ఓ చెంపపెట్టు. అల్లు అర్జున్, అట్లీ కూడా ఈ సినిమా కోసం భారీ పారితోషికాలనే తీసుకుంటున్నట్టు సమాచారం. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ పానిండియా చిత్రం 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

