Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె (Deepika Padukone) ఇటీవలే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్‌గా ఉన్న సమయంలోనే ‘కల్కి’ చిత్రాన్ని పూర్తి చేసిన దీపిక.. ఆ తర్వాత సినిమాల నుంచి కాస్త విరామం తీసుకుంది. ప్రస్తుతం మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది. ఇదిలా ఉండగా.. దీపికా పదుకొణె డెలివరీ తర్వాత తొలిసారి ఓ షోలో పాల్గొని ర్యాంప్ వాక్‌తో ఆకట్టుకుంది.
She’s the most gorgeous woman in the world I stand by it. 🤌🏼👏🏼🤎#25YearsOfSabyasachi #DeepikaPadukone pic.twitter.com/JCBMf6ZwSD
— newdeep 𐙚 (@deepekachu) January 26, 2025
సబ్యసాచి 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో (Sabyasachi Mukherjees 25th Anniversary ) పాల్గొన్న దీపిక.. డిఫరెంట్ లుక్‌లో తళుక్కుమని మెరిసింది. తెల్లటి దుస్తులు ధరించి కళ్లజోడు, వెరైటీ హెయిర్‌స్టైల్ తో ర్యాంప్ వాక్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు, ఫొటోల్లో దీపిక కాస్త బొద్దుగా గుర్తుపట్టలేనంతా మారిపోయింది. దీపికను చూసిన నెటిజన్లు, అభిమానులు స్టన్ అవుతున్నారు. బాడీ షేమింగ్ చేస్తున్నారు. సీనియర్ నటి రేఖాతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం రేఖ కూడా ఇలాంటి అవుట్ఫిట్స్తోనే కనిపించిన విషయం తెలిసిందే. దీంతో అచ్చం రేఖలా ఉన్నావంటూ నెటిజన్లు దీపికణు బాడీ షేమింగ్ చేస్తున్నారు.
Deepu’s outfit is giving striking Rekha ji vibes- a beautiful nod to timeless elegance 🙌😍#DeepikaPadukone #REKHA #RanveerSingh pic.twitter.com/UlteQImRst
— BollyHollywood (@BolllyHolly) January 26, 2025
గతేడాది సెప్టెంబర్ 8వ తేదీన ముంబైలోని ఓ ఆసుపత్రిలో దీపికా ఓ పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పాపకు దువా పదుకొణె సింగ్ (Dua Padukone Singh) అని పేరు పెట్టారు. ‘రామ్ లీలా’ అనే సినిమాలో తొలిసారి కలిసి నటించారు రణవీర్ సింగ్, దీపికా పదుకొణె. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సమయంలోనే వీరు ప్రేమలో పడ్డారు. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018లో పెళ్లి చేసుకున్నారు.
Also Read..
Vijay Deverakonda | బ్రిటిష్ కాలంనాటి కథ.. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ
Padma Awards | ప్రతిభామూర్తులకు పట్టం..
Ravi Teja | మనదే ఇదంతా.. రవితేజ మాస్ జాతర