Deepika Padukone | దీపిక పదుకొణే ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నది. తనెంత హ్యాపీగా ఉన్నదో తెలియజేయడానికి, తానున్న ప్రదేశానికి సంబంధించిన ప్రకృతి చిత్రాలను ఫొటోలుగా తీసి, సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్నది దీపిక. అందమైన ఆకాశం, నందనవనాన్ని తలపించే రంగురంగుల పూల మొక్కలు, గంభీరమైన సముద్రం.. ఇవన్నీ దీపిక ఫొటోలలో దర్శనిమిస్తున్నాయి.
ప్రస్తుతం ఆమె గర్భవతి అన్న విషయం తెలిసిందే. కాన్పుకు చేరువవుతున్న నేపథ్యంలో పుట్టబోయే పాపాయికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నది దీపిక. ప్రకృతి ఒడిలో ఎక్కువ సమయం గడపడం.. అవసరం మేర చిన్న చిన్న ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తూ తన జీవన విధానం గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది.
‘ఓ కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయాను. ఇది నా బిజీ లైఫ్‌కు భిన్నమైన ప్రపంచం. ఇక్కడ మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. మనసులోకి చెడు ఆలోచనలు రావు. ఎటు చూసినా ఆహ్లాదం.. చుట్టూ కావాల్సినంత స్వేచ్ఛ. ఈ ఆనందానికి కారణం నా మనసే. మన మనసు మన కంట్రోల్లో ఉంటే బాధలకు తావుండదు. ఇది మా నాన్న నుంచి నేర్చుకున్న పాఠం’ అంటూ చెప్పుకొచ్చింది దీపిక.