Deepika Padukone | మలేరియాతో పోరాడుతూ షూటింగ్ పూర్తి చేసిన దీపికా.. 16ఏళ్ల నాటి విశేషాలు వెల్లడించిన లారా దత్తా
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వృత్తిపట్ల ఉన్న అంకితభావానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. 2010లో విడుదలైన హౌస్‌ఫుల్ సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను సహనటి లారా దత్తా తాజాగా బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.లారా దత్తా తెలిపిన వివరాల ప్రకారం, ఇటలీలో జరుగుతున్న షూటింగ్ సమయంలో దీపికా పదుకొణె మలేరియా బారిన పడ్డారు. తీవ్రమైన జ్వరంతో, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ సినిమా పనులు ఆగకూడదనే ఉద్దేశంతో ఆమె సెట్స్‌కు హాజరవుతూ తన భాగం షూటింగ్ పూర్తి చేశారు.
Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె వృత్తిపట్ల ఉన్న అంకితభావానికి మరో ఉదాహరణ వెలుగులోకి వచ్చింది. 2010లో విడుదలైన హౌస్‌ఫుల్ సినిమా షూటింగ్ సమయంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలను సహనటి లారా దత్తా తాజాగా బయటపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.లారా దత్తా తెలిపిన వివరాల ప్రకారం, ఇటలీలో జరుగుతున్న షూటింగ్ సమయంలో దీపికా పదుకొణె మలేరియా బారిన పడ్డారు. తీవ్రమైన జ్వరంతో, శారీరకంగా బలహీనంగా ఉన్నప్పటికీ సినిమా పనులు ఆగకూడదనే ఉద్దేశంతో ఆమె సెట్స్‌కు హాజరవుతూ తన భాగం షూటింగ్ పూర్తి చేశారు. ఆమెకు విపరీతమైన జ్వరం ఉన్నా, ఒళ్లు వణికిపోతున్నా ఒక్కసారి కూడా అసహనం చూపలేదు. కెమెరా ముందు నిలబడినప్పుడు మాత్రం ఎక్కడా అలసట కనిపించేది కాదు” అని లారా పేర్కొన్నారు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ చిత్రీకరణలో కూడా దీపిక తన పూర్తి శక్తిని పెట్టి నటించిందని ఆమె తెలిపారు.
సెట్స్‌లో ఉన్న చిత్రబృందం దీపిక ఆరోగ్య పరిస్థితిని గమనించి వైద్య సదుపాయాలు కల్పించినప్పటికీ, ఆమె విశ్రాంతి తీసుకోవడంపై కన్నా షూటింగ్ పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చిందని వెల్లడించారు. షాట్ల మధ్యలో మందులు వేసుకుని కాస్త విశ్రాంతి తీసుకుని, మళ్లీ కెమెరా ముందు నిలబడేదని చెప్పారు. ఈ సమయంలో అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి సహనటులు ఆమెకు పూర్తి మద్దతు ఇచ్చారని లారా గుర్తుచేశారు. అయితే దీపిక చూపిన పట్టుదల మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచిందని తెలిపారు. దీపికా పదుకొణె కేవలం అందంతోనే కాదు, క్రమశిక్షణ, పనిపట్ల ఉన్న నిబద్ధతతోనే ఈరోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిందని లారా ప్రశంసించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా తాను ఒప్పుకున్న పనిని పూర్తి చేయాలనే లక్ష్యం ఆమెను ప్రత్యేకంగా నిలబెడుతుందని చెప్పారు.
దాదాపు 16 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన, నేటి యువ నటీనటులకు స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు. వెండితెరపై కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టం దాగి ఉంటుందో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. ఇక దీపికా పదుకొణే త్వరలో మరోసారి పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ రాకా చిత్రంతో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటిస్తూ అలరిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

