AA22xA6 Movie | అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో వస్తున్న ఈ మూవీ వస్తున్న మూవీలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తున్నది. ఈ మూవీకి ‘AA22xA6’ వర్కింగ్ టైటిల్ పేరు పెట్టారు. ఈ మూవీ దీపికా పదుకొనే ఈ ప్రాజెక్ట్ షూటింగ్ ఈ ఏడాది నవంబర్ నుంచి మొదలుకానున్నట్లు పింక్విల్లా నివేదిక తెలిపింది. విశేషం ఏంటంటే దీపికా వంద రోజుల పాటు రెగ్యులర్ షూటింగ్లో పాల్గొననున్నది. ఈ మూవీలో దీపిక ఓ యోధురాలి పాత్రను పోషించనున్నట్లు సమాచారం. లుక్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఇంతకుముందున్నడూ చూడని సరికొత్త అవతారంలో దీపికను ప్రేక్షకులు తెరపై చూడనున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మూవీలో యాక్షన్, భావోద్వేగ, నాటకీయ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తున్నది. ఈ మూవీలో అల్లు అర్జున్ మూడు పాత్రలు పోషించనున్నాడు. ప్రతిపాత్రకు డిఫరెంట్ లుక్‌లో ఉంటుందని సమాచారం.
ఈ మూవీ టైం ట్రావెల్లో ఉంటుందని.. హాలీవుడ్ ఇంటర్ స్టెల్లార్ మూవీస్ తరహాలో ఉండనున్నట్లు సమాచారం. ప్రపంచాన్ని కాపాడడం కోసం, శాంతిని కల్పించే మిషన్‌పై బన్నీ పని చేస్తాడని.. అందుకోసమే కాలంలో ప్రయాణించి విపత్తులను అడ్డుకుంటారని.. డైమెన్షన్ ట్రావెలర్‌గా అభిమానులను అలరించనున్నట్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వార్త చక్కర్లు కొడుతున్నది. సినిమాలో రెడ్ అండ్ బ్లూ పేరుతో అనే రెండు ప్రపంచాలను అట్లీ చూపించబోతున్నట్లుగా సమాచారం. ఈ ప్రాజెక్టు విషయంలో బన్నీ సీరియస్‌గా ఉన్నాడని.. ఇతర కమిట్మెంట్స్ని పక్కనపెట్టి కేవలం ‘AA22xA6’పై దృష్టి సారించాడు. అల్లు అర్జున్ పుష్ప-2 : ది రూల్ మూవీతో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఈ మూవీ ఏకంగా రూ.1800కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
బాక్స్ ఆఫీస్ వద్ద హైయెస్ట్ గ్రాస్ వసూలు చేసిన చిత్రాల్లో రెండో భారతీయ సినిమాగా ఘనత సాధించింది. 2021 లో వచ్చిన పుష్ప చిత్రంతో అల్లు అర్జున్ ఏకంగా బెస్ట్ యాక్టర్ కేటగిరిలో జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సైతం అందుకున్న విషయం తెలిసిందే. బన్నీ, అట్లీ మూవీ ఈ సినిమా నిర్మాణం సెప్టెంబర్ 2026 వరకు కొనసాగనున్నది. 2027 ద్వితీయార్థంలో పెద్ద ఎత్తున విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మరోవైపు అవెంజర్స్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, ఆక్వా మెన్ వంటి చిత్రాలకు వీఎఫ్ఎక్స్ అందించిన హాలీవుడ్ టాప్ టెక్నీషియన్లు ఈ చిత్రానికి పని చేయబోతున్నారు. దాదాపు రూ.800కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్లు తెలుస్తున్నది. ఇక ఈ మూవీలో అల్లు అర్జున్, దీపికా పదుకొనేతో పాటు రష్మిక మందన్న, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్ తదితర నటీనటులు కీలకపాత్రలో నటించనున్నట్లు సమాచారం. అయితే, దీపికా పదుకొనే ప్రస్తుతం ఇండస్ట్రీలో బిజీగా ఉన్నది. ఈ ఏడాది అక్టోబర్‌లో షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’ మూవీ షూటింగ్లో పాల్గొననున్నది.