Alia Bhatt | డీప్ ఫేక్ వీడియోలు హీరోయిన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయనే చెప్పాలి. ఈ ఏఐ సాంకేతికత వల్ల అసభ్యకరమైన వీడియోల బారిన పడి చాలామంది హీరోయిన్లు సఫర్ అవుతున్నారు. రష్మిక మందన్న, కాజోల్, రకుల్‌ప్రీత్ ఇలా ఈ డీప్‌ఫేక్ వీడియోల బారిన పడ్డ కథానాయికల లిస్ట్ పెద్దదే. రీసెంట్గా అలియాభట్ కూడా ఈ ఫేక్ వీడియోల బారిన పడింది. అయితే, తన వీడియోపై ఆమె స్పందించిన తీరు మాత్రం విభిన్నంగా ఉంది.
‘ఎక్కడ మంచి ఉంటుందో అక్కడే చెడు కూడా ఉంటుంది. సమస్యల వల్ల బాధ పడకూడదు. పరిష్కారాన్ని వెతకాలి. ఏఐ టెక్నాలజీ వల్ల ఉపయోగం ఉంది. కొన్ని రంగాలకు ఈ టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. సాంకేతిక అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగం. కొత్త కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలి. అయితే, అది దుర్వినియోగం అవుతున్న మాట వాస్తవం. అందుకని ఆ టెక్నాలజీనే తప్పు పట్టకూడదు. డీప్ ఫేక్ బారిన పడకుండా కొత్త చట్టాలను కూడా తేవాలి. నా వీడియో చూశాను. వాళ్ల ఆల్పానందాన్ని చూసి నవ్వుకున్నాను.’ అంటూ నవ్వుతూ స్పందించింది అలియా.