ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్, అలేఖ్య జంటగా నటించారు. చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ పాటను తెరకెక్కించినట్లు ఆర్.కె.గౌడ్ తెలిపారు. “బుల్లెట్..’ అనే ఈ పాటను హీరో కిరణ్, సోషల్‌మీడియా ఇన్ఫ్లూయెన్సర్స్ లాస్య, అనూహ్యలపై చిత్రీకరించాం. రాజ్‌కిరణ్ స్వరకర్త. మధుప్రియ ఆలపించారు.
యూత్‌ను ఆకట్టుకునే ఈ పాట సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. పట్టుదల, స్వయంకృషి ఉంటే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చనే స్ఫూర్తిదాయక కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిచాం. త్వరలో ‘కబడ్డీ’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నాం. మా సంస్థ నుంచి ఇకపై ఏడాదికి రెండు సినిమాలు తీయాలనుకుంటున్నాం’ అని ఆర్.కె.గౌడ్ పేర్కొన్నారు.