‘దీక్ష ఉంటే ఏదైనా సాధించగలం అని తెలియజెప్పే కథాంశంతో ఈ సినిమా రూపొందించాం. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది. చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ జరుగుతున్నది. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం.’ అని ప్రతాని రామకృష్ణగౌడ్ అన్నారు.
ఆయన స్వీయదర్శకత్వంలో పినిశెట్టి అశోక్‌కుమార్‌తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘దీక్ష’. కిరణ్‌కుమార్, అలేఖ్యరెడ్డి జంటగా నటించారు. చిత్రీకరణపూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ప్రతాని రామకృష్ణగౌడ్ మట్లాడారు. ఈ చిత్రంలో భాగం కావడం పట్ల నటీనటులందరూ ఆనందం వెలిబుచ్చారు.