చైతన్యరావు, యష్ణ చౌదరి జంటగా నటించిన చిత్రం ‘డియర్ నాన్న’. అంజి సలాది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రాకేష్ మహంకాళి నిర్మించారు. ఈ నెల 14 నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నది. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కరోనా బ్యాక్‌డ్రాప్‌లో తండ్రీకొడుకుల అనుబంధానికి దర్పణంలా ఈ సినిమా ఉంటుంది. వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు హృదయానికి హత్తుకుంటాయి. ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది. ఫాదర్స్డేకు పర్ఫెర్ట్ గిఫ్ట్లాంటి సినిమా ఇది’ అన్నారు. సీవీఎల్ నరసింహ, ఆదిత్య వరుణ్, వినీల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అనిత్ కుమార్ మదాడి, సంగీతం: గిఫ్టన్ ఎలియాస్, దర్శకత్వం: అంజి సలాది.