DDLJ Movie | బాలీవుడ్లోనే కాదు భారతీయ సినిమా చరిత్రలో అత్యద్భుత ప్రేమకథగా నిలిచిన దిల్వాలే దుల్హానియా లే జాయేంగే (డిడిఎల్జే) మూడున్నర దశాబ్దాలు పూర్తి చేసుకుంది. షారుఖ్ ఖాన్ – కాజోల్ జంట కెమిస్ట్రీ, హృదయాలను తాకే సంగీతం, మరపురాని సంభాషణలు ఈ చిత్రాన్ని సాధారణ సినిమాగా కాకుండా ఒక అనుభూతిగా మార్చాయి. ఆదిత్య చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికీ ముంబైలోని మరాఠా మందిర్ థియేటర్లో ప్రదర్శించబడుతున్న అరుదైన క్లాసిక్‌గా నిలిచింది.30వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లండన్‌లోని లీసెస్టర్ స్క్వేర్ వద్ద షారుఖ్–కాజోల్ జంటకు ప్రత్యేకంగా రూపొందించిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి షారూఖ్-కాజోల్ జంట స్వయంగా హాజరై మరింత ఆకర్షణగా మార్చారు. వీరిద్దరూ కలిసి ఇచ్చిన పోజులు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. నీలిరంగు ఆధునిక చీరతో కాజోల్ అందంగా మెరిసిపోగా, బ్లాక్ సూట్లో షారుఖ్ ఎప్పటిలాగే స్టైలిష్‌గా కనిపించాడు. డిడిఎల్జే నుంచి అభిమానులు పలు క్లిప్‌లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ సంబరాలను జరుపుకుంటున్నారు.డీడీఎల్జే చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీ రికార్డ్స్ మరే చిత్రం బ్రేక్ చేయలేకపోయింది.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న కింగ్ ఒక భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా. అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునే, రాణి ముఖర్జీతో పాటు అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్ క్యాస్ట్ ఈ చిత్రంలో కనిపించనున్నారు. షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ కూడా ఇందులో కీలక పాత్రలో నటిస్తోంది. 2026లో గ్రాండ్ రిలీజ్‌కు సన్నాహాలు జరుగుతున్న ఈ ప్రాజెక్ట్ షారుఖ్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా భావిస్తున్నారు.ఇక కాజోల్ ప్రస్తుతం ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఓ బుల్లితెర షో నిర్వహిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇటీవల మా అనే హారర్ థ్రిల్లర్‌లో కూడా కనిపించి ప్రశంసలు అందుకుంది.