David Warner | ‘ఇరుముడి’ ఫీవర్.. అయ్యప్ప గెటప్‌లో డేవిడ్ వార్నర్!
Irumudi | ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
Irumudi | ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌కు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సోషల్ మీడియాలో ఆయనకు సంబంధించిన ఒక ఫ్యాన్-ఎడిటెడ్ పోస్ట్ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లోని ప్రముఖ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ పేజ్ ‘ఆరెంజ్ ఆర్మీ ఫేవరెట్’ (orangearmyforever) సృష్టించిన ఈ పోస్ట్‌లో వార్నర్‌ను భక్తి శ్రద్ధలతో కూడిన అయ్యప్ప భక్తుడి గెటప్‌లో చిత్రించారు. మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ఇరుముడి’ చిత్రంలో ఆయన అయ్యప్ప భక్తుడిగా కనిపించగా, సరిగ్గా అదే గెటప్‌లో వార్నర్‌ను ఊహిస్తూ అభిమానులు ఈ పోస్టర్‌ను డిజైన్ చేశారు. ఈ క్రియేటివ్ ఫ్యాన్-ఆర్ట్ నటుడు డేవిడ్ వార్నర్‌ను ఎంతగానో ఆకట్టుకోవడంతో, ఆయన స్వయంగా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
మరోవైపు, మాస్ మహారాజా రవితేజ నటించిన తాజా సంచలనం ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అపూర్వ స్పందన అందుకుంటున్న ఈ ఎమోషనల్ యాక్షన్ డ్రామా.. వరుసగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొడుతూ దూసుకుపోతోంది. ఇప్పటికే తొలి వీకెండ్లోనే రూ.80 కోట్ల గ్రాస్ మార్క్‌ను అత్యంత వేగంగా అందుకున్న ప్రాంతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా, తాజాగా మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. 2026 సంవత్సరంలో విడుదలైన తెలుగు సినిమాల్లో తొలి ఆదివారం నాడు అత్యధిక మంది ప్రేక్షకులు థియేటర్లకు వచ్చిన చిత్రంగా ‘ఇరుముడి’ సరికొత్త రికార్డు సృష్టించింది. థియేటర్ల వద్ద ప్రేక్షకుల తాకిడి పెరుగుతుండటంతో టాలీవుడ్ ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

