David Warner| ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుగు ప్రేక్షకులకి కూడా సూపరిచితమే.క్రికెట్ ద్వారా కోట్లాదిమంది అభిమానులను సాధించుకున్న డేవిడ్ వార్నర్… రీల్స్‌తో ఇక్కడ బాగా ఫేమస్ అయ్యాడు. తెలుగు హీరోల మేనరిజం ప్రదర్శిస్తూ అందరికి చేరువయ్యాడు. గతంలో వచ్చిన పుష్ప చిత్రానికి సంబంధించిన పుష్ప రాజ్ మేనరిజాన్ని అనుసరించి ఇండస్ట్రీలోను హాట్ టాపిక్ అయ్యారు. మాజీ సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్..నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమాలో కీలక పాత్ర పోషించారు. అయితే ‘రాబిన్ హుడ్’ ట్రైలర్ విడుదల కార్యక్రమం ఇవాళ సాయంత్రం జరగనుంది. అది కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో.
తొలుత ఈ ట్రైలర్‌ను ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో చేయాలని ప్లాన్ చేసిన అది కొన్ని కారణాల వలన సాధ్యం కాలేదు. దాంతో ప్రీ రిలీజ్ ఈవెంట్లో రిలీజ్ చేస్తున్నారు. ఈవెంట్లో నితిన్, హీరోయిన్ శ్రీ లీలతో పాటు డేవిడ్ వార్నర్ కూడా సందడి చేయనున్నారు. ఇప్పటికే వార్నర్ హైదరాబాద్‌లో ల్యాండ్ కాగా, ఆయన హైటెక్ సిటీ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించి తెగ సందడి చేయనున్నారు. అసలు ఈవెంట్‌ని యూసఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్ లో నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే… వర్షం పడుతుందేమో అని అనమానంతో షిఫ్ట్ చేశారు. హైదరాబాద్ సిటీలో శుక్రవారం రాత్రి కూడా వర్షం కురిసింది. రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నివేదిక నివ్వడంతో షిష్ట్ చేశారు.
ఇక వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్ గా గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో భారీ చిత్రాలను తెరకెక్కిస్తున్న ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. నవీన్ ఎర్నేని, ఎలమంచి రవిశంకర్ నిర్మాతలుగా వ్యవహరించారు. 60 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.