David Reddy | మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ నుంచి ఒక క్రేజీ అప్డేట్ వెలువడింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని చిత్ర బృందం ఆయనకు నేడు ఘనంగా నివాళులు అర్పించింది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నేతాజీ ఆశయాలకు అనుగుణంగా ఉంటుందని, అందుకే ఆయన స్ఫూర్తిని చాటనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రం 1897 నుంచి 1922 మధ్య కాలంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. బ్రిటిష్ వారిపై పోరాటం చేసిన భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి వీరుల తరహాలోనే ‘డేవిడ్ రెడ్డి’ అనే యోధుడు దేశం కోసం ఎలా పోరాడాడు అనే అంశాన్ని దర్శకుడు హనుమరెడ్డి యక్కంటి చాలా పవర్‌ఫుల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘వార్ డాగ్’ గ్లింప్స్‌లో వినిపించిన సంభాషణలు, మంచు మనోజ్ మేకోవర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచాయి.
ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి.
Give me blood, and I will give you freedom.”
This line didn’t just shape history —
it shaped my journey and the soul of David Reddy.In remembrance of
Netaji Subhash Chandra Bose
on Parakram Diwas.— Team David Reddy@HeroManoj1
#DavidReddy #NetajiSubhashChandraBose 🫡 pic.twitter.com/Y1oLPQOWoz— Hanuma reddy (@itshanumareddy) January 23, 2026