South Indian Screnss | ప్రేక్షకులకు ఎప్పుడూ వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ముందుండే ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5, మరో తెలుగు ఒరిజినల్ సిరీస్‌తో అలరించేందుకు సిద్ధమైంది. నటుడు రాజీవ్ కనకాల, ప్రముఖ యాంకర్ ఉదయ భాను ప్రధాన పాత్రల్లో నటించిన ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’ సిరీస్ అక్టోబర్ 31 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ కానుంది. సౌతిండియన్ స్క్రీన్స్ (రెక్కీ, విరాటపాలెం వంటి సక్సెస్ఫుల్ సిరీస్‌ల నిర్మాతలు) ఈ సిరీస్‌ను నిర్మించగా, పోలూరు కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌లో రాజీవ్ కనకాల ‘ప్రసాద రావు’ పాత్రలో నటించారు. కూతురు స్వాతి (వసంతిక) కనిపించకుండా పోవడంతో, ఆమెను వెతుకుతూ తండ్రి పడే వేదన చుట్టూ కథ తిరుగుతుంది. తన కూతురి అన్వేషణలో ప్రసాద రావుకు ఎదురయ్యే నిజాలు, మోసాలు, ఊహించని రహస్యాలు ఈ సిరీస్‌కు అసలైన సస్పెన్స్. ప్రేమ, కోల్పోయినప్పుడు ఉండే వెలితి, మోసం వంటి భావోద్వేగాల మధ్య నడిచే ఈ ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఈ సిరీస్‌లో ఉదయ భాను కూడా కీలక పాత్ర పోషించారు. ఈ సిరీస్ అక్టోబర్ 31న జీ5లో రాబోతున్న సందర్భంగా చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తెలుగు జీ5 బిజినెస్ హెడ్ అనురాధ గూడూరు మాట్లాడుతూ ‘మనలో ఉండే భావోద్వేగాల నుంచి శక్తివంతమైన కథలు వస్తాయని మా జీ 5 నమ్మకం. అలాంటి కథే ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు’. ఇది తండ్రి మనసులోని ప్రేమ, బలమైన ఇంటెన్సిటీని, మనసులో తెలియని భయాలను ఆవిష్కరిస్తుంది. ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే కథాంశమిది. దీన్ని సస్పెన్స్‌తో దర్శకుడు తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చొని పెడుతుంది. రాజీవ్ కనకాల, ఉదయభాను వసంతిక అద్భుతమైన నటనతో మెప్పించారు. పోలూరు కృష్ణ, సౌతిండియన్ స్క్రీన్స్ ఈ సిరీస్‌ను మనసుకి హత్తుకునేలా, ప్రభావవంతంగా రూపొందించారు’’ అన్నారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ ‘డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’లోని ఎమోషనల్ కంటెంట్ నాకు బాగా నచ్చింది. ఇది ఒక మిస్టీరియస్, సస్పెన్స్‌ఫుల్ నెరేషన్‌తో సాగేది మాత్రమే కాదు. తండ్రీ కూతురు మధ్య ఉండే విడదీయరాని ప్రేమానుబంధాన్ని తెలియజేస్తుంది. ప్రసాదరావుగా నటించేటప్పుడు నేను కూడా ఓ తండ్రిగా ఆ ఎమోషన్స్‌ను ఫీలయ్యాను. యూనివర్సల్ పాయింట్‌తో నడిచే కథతో రూపొందింది. కాబట్టి ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. కుటుంబంలోని బలమైన బంధాలు, ప్రేమను ఇది ఆవిష్కరిస్తుంది’’ అన్నారు.
నటి ఉదయభాను మాట్లాడుతూ.. డాటరాఫ్ ప్రసాద్ రావు: కనపడుటలేదు’ కథ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గానే కాదు.. బలమైన ఎమోషన్స్‌తో కనెక్ట్ అవుతుంది. ఇంటెన్స్ స్టోరీ మనసులను తాకుతుంది. ఇద్దరమ్మాయిలకు తల్లిగా నేను ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యాను. అలాగే ఆసక్తికరమైన కథనంతో సిరీస్ బ్యాలెన్స్డ్గా మెప్పిస్తుంది. ఇదే యూనిక్ కంటెంట్‌గా మెప్పిస్తుంది అన్నారు.
A daughter missing. A father’s world shattered. 💔
Witness an emotional rollercoaster wrapped in suspense and haunting secrets.
Stream the new investigative thriller from 31st Oct only on #TeluguZEE5 @RajeevCo @SouthINDscreens#SriRamVenkat #SouthIndianScrenss #ZEE5 pic.twitter.com/O4V0IOk2jU— ZEE5 Telugu (@ZEE5Telugu) October 7, 2025