టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద త్వరలోనే బ్యాక్ టు బ్యాక్ సినిమాల సందడి షురూ కానుంది. మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో రవితేజ (Ravi Teja) నటిస్తోన్న రావణాసుర (Ravanasura) ఒకటి. సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు నాని (Nani) నటిస్తోన్న దసరా సినిమా కూడా ఎక్జయిటింగ్ ప్రాజెక్టుల్లో ఉంది. ఈ రెండు సినిమాలు వారం గ్యాప్‌లో విడుదల కానున్నాయి.
దసరా (Dasara) మార్చి 30న విడుదల కానుండగా.. రావణాసుర ఏప్రిల్ 7న విడుదలవుతుంది. కాగా ఇప్పుడొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. అదేంటంటే రవితేజ, నాని ఒకేసారి ప్రమోషన్స్ లో పాల్గొనబోతున్నారు. ఈ ఇద్దరూ కలిసి ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. మేకర్స్ రవితేజ, నాని కాంబోలో స్పెషల్ ఇంటర్వ్యూ నిర్వహించి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు టాలీవుడ్ సర్కిల్ సమాచారం. రవితేజ, నానిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే.. ఈ ఇద్దరు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోల స్థాయికి రావడం. మొత్తానికి సెల్ఫ్ మెయిడ్ యాక్టర్లిద్దరితో ఇంటర్వ్యూ తో సినిమాల బిజినెస్ ఎలా ఉండబోతుందనేది చూడాలి.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న దసరా మార్చి 30న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు ముస్తాబవుతోంది. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.
రావణాసుర చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, రవితేజ టీమ్ వర్క్స్ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. రావణాసురలో రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్దన్ రామేశ్వర్- భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
రావణాసుర గ్లింప్స్ వీడియో..
దసరా ట్రైలర్..
స్టన్నింగ్ మాస్ టీజర్‌పై ఓ లుక్కేయండి..