Srikanth Odela | దసరా (Dasara) సినిమాతో ఎంట్రీతోనే సూపర్ హిట్టు కొట్టాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela). ఈ యంగ్ డైరెక్టర్ తొలి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. ఒక్క సినిమాతో సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెల వ్యక్తిగత జీవితంలో కొత్త చాప్టర్‌ను మొదలుపెట్టాడు. శ్రీకాంత్ ఓదెల బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టాడు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శ్రీకాంత్ ఓదెల వివాహ వేడుక జరిగింది.
వెడ్డింగ్ ఈవెంట్ (wedding)కు ఫిలిం ఇండస్ట్రీ నుంచి దర్శకుడు సుకుమార్, నాని కపుల్, జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కేవీతోపాటు పలువురు సెలబ్రిటీలు హాజరై.. వధూవరులను ఆశీర్వదించారు. అయితే నాని (Nani) వెడ్డింగ్ ఈవెంట్‌కు హాజరుకాలేకపోయాడు. పూణేలో ఓ యాడ్ ఫిల్మ్ షూటింగ్ కారణంగా వెడ్డింగ్‌కు రాలేకపోయాడని సమాచారం. కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న శ్రీకాంత్ ఓదెలకు శుభాకాంక్షలు తెలియజేశాడు నాని. వధువుకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో తెలంగాణలో సింగరేణి బ్యాక్ డ్రాప్‌లోని వీర్లపల్లి గ్రామంలో జరిగే కథ నేపథ్యంలో తెరకెక్కించిన దసరా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిపించింది. ఈ సినిమా సక్సెస్‌తో అగ్ర దర్శకనిర్మాతలు, చిత్రనిర్మాణ సంస్థల దృష్టిని ఆకర్షించాడు శ్రీకాంత్ ఓదెల. ఈ డైరెక్టర్ కొత్త సినిమా ప్రకటించలేదు. శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం ఓ టాప్ ప్రొడక్షన్ హౌజ్‌తో చర్చలు కొనసాగిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.