Paradha Movie | రీసెంట్గా టిల్లు స్క్వేర్తో బ్లాక్ బస్టర్ అందుకుంది అందాల భామ అనుపమ పరమేశ్వరన్. ఇప్పుడు ఆమె నటిస్తున్న తాజా చిత్రం ‘పరదా’. ఈ సినిమాకు ప్రవీణ్ కాండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకాడ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ లుక్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా మూవీ నుంచి మరో కథానాయికను పరిచయం చేశారు మేకర్స్. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ దర్శన రాజేంద్రన్ నటిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా దర్శన ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే సంప్రదాయపు కట్టుబాట్లను దాటి ఒక మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా రానుంది.
అమిష్త అనే పాత్రలో దర్శన కనిపించనుంది. మలయాళంలో దర్శన మంచి క్రేజ్ ఉన్న నటి. ఇప్పుడు ఆమె తెలుగులో ఎంట్రీ ఇస్తుండటంతో, ఈ సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.
Birthday wishes to the beautiful and super talented @darshanarajend, who brought ‘Amishta’ to life in #Paradha 💕
Here’s a special video – https://t.co/TEAv1m4usP#DarshanaRajendran pic.twitter.com/xEEHZApET0— Ramesh Pammy (@rameshpammy) June 17, 2024