Darshan Vs Police | ‘పునీత నమన’ ఈవెంట్లో స్టార్ హీరోకు చేదు అనుభవం..వీడియో వైరల్
దివంగత కన్నడ (Kannada Film Industry) పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) సంస్మరణ సభ (Puneeth Namana) నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన కన్నడ హీరో దర్శన్‌కు చేదు అనుభవం ఎదురైంది.

దివంగత కన్నడ (Kannada Film Industry) పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) సంస్మరణ సభ (Puneeth Namana) నవంబర్ 16న బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ (Bengaluru Palace Grounds)లో జరిగింది. దీనికి దేశం నలుమూలల నుంచి పునీత్ తో సన్నిహిత సంబంధాలున్న ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. కర్ణాటకలోని సినీ రాజకీయ ప్రముఖులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై (Basavaraj Bommai)తోపాటు మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సహా పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమంలో హాజరై పునీత్ గురించి..ఆయన చేసిన సేవల గురించి కొనియాడారు. అయితే ఈ కార్యక్రమంలో కన్నడ హీరో దర్శన్ ( Darshan)కు చేదు అనుభవం ఎదురైంది. కర్ణాటకలో ఈయనను అభిమానులు D బాస్ అని ప్రేమగా పిలుచుకుంటారు. అక్కడ టాప్ 5 హీరోలలో దర్శన్ కూడా ఉంటాడు. అలాంటి హీరోకు బెంగుళూరు ప్యాలెస్ గ్రౌండ్స్ బయట అవమానం ఎదురైంది.
పునీత్ రాజ్ కుమార్ సంస్మరణ సభకు వస్తున్న ఆయనను గేటు దగ్గర పోలీసులు ఆపారు. లోపల ఆడిటోరియం ఫుల్ అయిందని.. కూర్చోటానికి సీట్లు లేవని.. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపొండి అంటూ పోలీసులు దర్శన్ ను వారించారు. తను లోపలికి వెళ్లి కాసేపు ఉండి.. మళ్లీ బయటికి వస్తాను అని చెప్పినా కూడా వినిపించుకోలేదు. నిలబడి చూస్తాను అని చెప్పినా కూడా వాళ్లు పట్టించుకోలేదు. ఆ సమయంలో స్టార్ హీరో దర్శన్‌తోపాటు అతడి అనుచరులు..యువ హీరో వినోద్ ప్రభాకర్ కూడా ఉన్నారు. ఒకప్పటి ఫేమస్ టాలీవుడ్ విలన్ కన్నడ ప్రభాకర్ కొడుకు ఈ వినోద్ ప్రభాకర్. దర్శన్ హీరోగా వచ్చిన రాబర్ట్ సినిమాలో కీలక పాత్రలో నటించాడు వినోద్.
ఇద్దరూ కలిసి పునీత్ సభకు వచ్చారు. చాలా సేపు పోలీసులతో మాట్లాడిన తర్వాత ఉన్నతాధికారులు వచ్చి దర్శన్ ను లోనికి అనుమతించారు. కానీ అక్కడికి వెళ్లినా ఆయనకు నిరాశే ఎదురైంది. లోపల కూర్చోవడానికి సీట్లు లేక సెకండ్ క్లాస్ లో కాసేపు కూర్చున్నాడు దర్శన్. అయితే అక్కడ ఇబ్బందిగా ఉండడంతో సభ మధ్యలోనే ఆయన బయటకు వెళ్ళిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇది కూడా చూడండి
Prabhas Gift to Fan | కొత్త ట్రెండ్‌కు ప్రభాస్ శ్రీకారం..అభిమానికి ఖరీదైన కానుక
Anubhavinchu Raja trailer | ‘రూపాయి పాపాయి లాంటిది..’అనుభవించు రాజా ట్రైలర్
Sushant Singh | ఘోర రోడ్డు ప్రమాదం.. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఫ్యామిలీలో ఐదుగురు మృతి
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

