Darshan | రేణుకాస్వామి హత్యకేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్ (Darshan) అతడి స్నేహితురాలు నటి పవిత్రగౌడతోపాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. ఈ కేసులో దర్శన్‌తోపాటు మిగిలిన వారంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇటీవలే ఈ కేసులో నిందితులపై ఛార్జీషీట్ దాఖలు చేసిన పోలీసులు 24వ అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట నివేదిక సమర్పించారు. రేణాకాస్వామి తనను క్షమించాలని వేడుకుంటుండగా.. దర్శన్ గ్యాంగ్ కనికరించకుండా దారుణంగా కొట్టి చంపారంటూ కొన్ని ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ముందుగా వచ్చిన వార్తలే నిజమయ్యాయి. రేణుకాస్వామిపై దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించాడు. తాను రేణుకా స్వామి ఛాతీ, మెడ, తలపై కొట్టానని పేర్కొన్న దర్శన్.. నటి పవిత్ర గౌడను కూడా చెప్పుతో కొట్టమని అడిగానని విచారణలో పోలీసులకు చెప్పాడు. నేనతడి మెడతోపాటు ఛాతీ, తలపై తన్నడమే కాదు.. అతన్ని చెప్పుతో కొట్టమని పవిత్రకు చెప్పానంటూ స్టేట్మెంట్ ఇచ్చాడన్న వార్త ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
పవిత్ర గౌడకు సంబంధించిన అసభ్యకర ఫొటోలు పంపించాడన్న ఆరోపణల్లో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్ అండ్ టీం దారుణంగా హత్య చేసిందని తేలింది. పవిత్ర గౌడకు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకా స్వామిని దారుణంగా కొట్టి, కరెంటు షాక్‌లు కొట్టినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను కూడా గుర్తించారు.
ఈ కేసుకు సంబంధించిన దాఖలు చేసిన 3,991 పేజీల ఛార్జిషీట్లో ఏ1గా హీరోయిన్ పవిత్ర గౌడ, ఏ2గా హీరో దర్శన్ పేర్లను పేర్కొన్నారు.
సిట్ ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ నివేదికలను సైతం చార్జిషీట్లో ప్రస్తావించింది. రేణుక స్వామి కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 50 మందికిపైగా పోలీసులు, ఎనిమిది మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు.
Jr NTR | ఒకే ఫ్రేమ్‌లో సందీప్ రెడ్డి వంగా, జూనియర్ ఎన్టీఆర్ .. స్పెషలేంటో మరి..!
Maa Nanna Superhero | క్యూరియాసిటీ పెంచుతోన్న సుధీర్ బాబు.. మా నాన్న సూపర్ హీరో ఫస్ట్ లుక్ వైరల్
KA | కిరణ్ అబ్బవరం క టీంకు దుల్కర్ సల్మాన్ సపోర్ట్