పూర్ణ, త్రిగుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘డార్క్ నైట్’. జీఆర్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ రెడ్డి కొవ్వూరి నిర్మించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెన్సార్‌కు సిద్ధమవుతున్నది. శుక్రవారం అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ టీజర్‌ను విడుదల చేశారు. ‘సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రమిది. పూర్ణ పాత్ర భిన్న కోణాల్లో సాగుతుంది.
నాలుగు పాత్రల చుట్టూ నడిచే ఈ కథలోని అనూహ్య మలుపులు ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురిచేస్తాయి. ఓ రాత్రి చోటుచేసుకునే ఘటనలు థ్రిల్‌కి గురిచేస్తాయి. మార్చి నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మిస్కిన్, కథ, దర్శకత్వం: జీఆర్ ఆదిత్య.