‘దర్జా’ యాక్షన్ ప్రధానంగా సాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రం. జీవితంలో ఎన్నో కష్టాల్ని ఎదుర్కొన్న యువతి ప్రజలకు ఏం చేసిందన్నది ఆసక్తికరంగా ఉంటుంది’ అని అన్నారు నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి. వారు నిర్మాతలుగా అనసూయ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకుడు. నేడు విడుదలకానుంది.
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘ఈ క్యారెకర్టర్కు అనసూయ పర్ఫెక్ట్గా కుదిరింది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో 400 స్క్రీన్స్‌లో చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సెన్సార్‌వారు సినిమా చూసి బాగుందన్నారు. అనసూయతో చక్కటి యాక్షన్, సెంటిమెంట్ సినిమా తీశారని మెచ్చుకున్నారు భవిష్యత్తులో మా బ్యానర్లో ఫ్యామిలీ అండ్ యాక్షన్ సినిమాలు చేయాలనుకుంటున్నాం’ అన్నారు.