లక్ష్మీరాయ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఝాన్సీ ఐపీఎస్’ చిత్రం కన్నడ, తమిళ భాషల్లో మంచి విజయాన్ని సాధించింది. గురుప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తెలుగు హక్కులను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ సొంతం చేసుకున్నారు. ఆర్కే ఫిలిమ్స్ పతాకంపై ఆయన తెలుగులో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ‘యువతకు డ్రగ్స్ సరఫరా చేసే మాఫియాపై ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పోరాటం ఏమిటన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. లక్ష్మీరాయ్ పాత్రలో మూడు షేడ్స్ కనిపిస్తాయి. యాక్షన్, సందేశంతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది’ అని చెప్పారు.