Ilaiyaraaja biopic | ప్రముఖ సంగీత దర్శకుడు ఇండియన్ మాస్ట్రో ఇళయరాజా బయోపిక్ రాబోతున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇళయరాజా జీవితచరిత్ర ఆధారంగా వస్తున్న ఈ చిత్రంలో ధనుష్ హీరోగా నటించనున్నారు. ఈ సినిమాకు ‘కెప్టెన్ మిల్లర్’ దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించబోతున్నాడు.
2024లో షూటింగ్ మొదలుపెట్టి.. 2025లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఇళయరాజా మోషన్ పోస్టర్ను ధనుష్ ఎక్స్ వేదికగా పంచుకున్నాడు. ఇక ఈ పోస్టర్లో సంగీత దర్శకుడు అవుదామని మద్రాస్ నగరం కు వచ్చిన ఇళయరాజా పాత్రను చూడవచ్చు. ఈ సినిమా ప్రారంభ వేడుకలో కమలహాసన్, ఇళయరాజా, హీరో ధనుష్ యువన్ శంకర్ రాజా తదితరులు పాల్గోన్నారు.
Honoured @ilaiyaraaja sir 🙏🙏🙏 pic.twitter.com/UvMnWRuh9X
— Dhanush (@dhanushkraja) March 20, 2024