డ్యాన్స్ ప్రేమికులను అలరించిన ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1’ డాన్స్ షోకు కొనసాగింపుగా రూపొందిన డ్యాన్స్ షో ‘డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వైల్డ్‌ఫైర్’. ఈ నెల 14 నుంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రీమియర్‌కు ఈ డాన్స్ షో రెడీ అయ్యిందని ప్రముఖ యాంకర్, దర్శకుడు, డాన్స్ ఐకాన్ సీన్ 2 హోస్ట్ అయిన ఓంకార్ తెలిపారు. తాను, ఫరియా అబ్దుల్లా హోస్టులుగా, శేఖర్ మాస్టర్ జడ్జ్‌గా వ్యవహరిస్తున్నామని, సీజన్1ను మించేలా సీజన్2 ఉంటుందని, ఈ డాన్స్ ఐకాన్2-వైల్డ్ఫైర్లో అయిదుగురు కంటెస్టెంట్స్ మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తారని, ముఖ్యంగా ఇద్దరు పిల్లల పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్‌ది టౌన్ అవుతుందని ఓంకార్ తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో ముగ్గురు హోస్ట్‌లతో పాటు నలుగురు మెంటార్స్ కూడా ఉంటారని, డ్యాన్సర్స్ జాను లైరి, ప్రకృతి, మానస్, దీపిక ఈ నలుగురు మెంటార్స్‌గా వ్యవహరిస్తారని, ఫస్ట్ రౌండ్ విజేతల్ని ఆ మెంటార్సే నిర్ణయిస్తారని, సెకండ్ రౌండ్ విజేతను నిర్ణయించేది మాత్రం ప్రేక్షకులేనని ఓంకార్ తెలిపారు.