Rana Naidu Web-Series | ఎప్పుడెప్పుడా అని అటు దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ ఎట్టకేలకు నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చేసింది. అలా వచ్చిందో లేదో.. ఈ వెబ్ సిరీస్‌పై ఓ రేంజ్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు నుంచే ఈ వెబ్ సిరీస్‌ను ఒంటరిగా చూడాలని దగ్గుబాటి హీరోలు చెప్పినా.. ఫ్యామిలీ హీరోగా తిరుగులేని అభిమానగణం ఉన్న వెంకీ ఫ్యాన్స్ అవన్నీ పట్టించుకోకుండా సిరీస్‌ను చూడటం మొదలుపెట్టారు. తీరా మొదటి ఎపిసోడ్ మొదలు పెట్టగానే.. న్యూడ్ సీన్స్, విచ్చలవిడిగా బూతులు చూసి వెంకీ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. వెంకీ మామ ఏంటి ఇలాంటి సిరీస్ చేశాడు అని తీవ్రంగా నిరాశపడుతున్నారు.
మూడు దశాబ్దాల సినీ కెరీర్లో వెంకటేష్ దాదాపు చేసినవన్ని ఫ్యామిలీ సినిమాలే. ముఖ్యంగా వెంకటేష్‌కు ఫ్యామిలీ ఆడియెన్స్‌లో ఉన్న క్రేజ్ వేరు. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్ల వద్ద ఫ్యామిలీ ఆడియెన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. అలాంటి పేరున్న వెంకటేష్ ఇలాంటి వెబ్ సిరీస్‌లో నటించడంతో అందరూ షాక్ తింటున్నారు. రెమ్యునరేషన్ వల్ల వెంకీ మామా ఒప్పుకున్నాడా? లేదంటే వెబ్ సిరీస్‌ల ట్రెండ్ నడుస్తుందని ఒప్పుకున్నాడో తెలియదు కానీ ఈ వెబ్ సిరీస్ వల్ల వెంకీ మాత్రం టార్గెట్ అయ్యాడు. ఈ వెబ్ సిరీస్ వెంకీ మామా సినీ కెరీర్‌లోని ఒక మచ్చగా మిగిలిపోయింది. వెంకీ అభిమానుల సైతం ఈ సిరీస్‌పై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా వెంకటేష్ ఈ వెబ్ సిరీస్‌ను ఒప్పుకున్నాడే అని తలలు పట్టేసుకుంటున్నారు.
నిజానికి నెట్‌ఫ్లిక్స్ సిరీస్ అంటేనే అసభ్యకర దృశ్యాలు, అసభ్య పదజాలంతో ఉంటాయని పలువురు నెటీజన్లు అభిప్రాయపడుతుంటారు. కానీ వెంకీమామ నటించనుండటంతో అలాంటి వాటికి ఈ సిరీస్‌లో తావులేదనుకుని అందరూ అనుకున్నారు. కానీ ఈ మధ్యన వచ్చిన సిరీస్‌ల కంటే అధికంగా బూతులు ఈ సిరీస్‌లోనే ఉండటం గమనార్హం. అమెరికన్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘రే డోనోవన్’ ఆధారంగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. కరన్ అన్షుమాన్, సుపర్న్ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మొత్తం పది ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కో ఎపిసోడ్ 45-50 నిమిషాల నిడివిని కలిగి ఉన్నాయి. ఇక ఈ సిరీస్ తెలుగు, హిందీతో పాటు తమిళ్, మలయాళం, స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉంది.
Caution: #RanaNaidu is strictly not a family show. Please do not watch it with your family. pic.twitter.com/SZ6LRqBVIH
— Streaming Updates (@OTTSandeep) March 11, 2023
#RanaNaidu on NETFLIX.
🔞 Series… Watched 1 Episode. 🔞 pic.twitter.com/2MJCScAdyA
— Christopher Kanagaraj (@Chrissuccess) March 11, 2023
Venkatesh undu kada ani idhi family tho chudakandi roy…! #RanaNaidu pic.twitter.com/W0YLWJA8QD
— Tonygaaaadu (@tonygaaaadu) March 10, 2023