Daggubati Venkatesh | టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని (Havyavahini) నిశ్చితార్థ వేడుకలు విజయవాడలో ఘనంగా జరిగాయి. విజయవాడకు చెందిన డాక్టర్ ఫ్యామిలీతో వెంకటేష్ వియ్యం అందుకున్నట్లు తెలుస్తుంది. కాగా.. హవ్యవాహిని నిశ్చితార్థ వేడుకలకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ వేడుకల్లో మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, నాగ చైతన్య, దగ్గుబాటి రానా, సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వెంకటేష్‌కు నలుగురు సంతానం. అందులో ముగ్గురు అమ్మాయిలు. చివరిగా కుమారుడు అర్జున్ జన్మించాడు. పెద్ద కుమార్తె ఆశ్రిత వివాహం నాలుగేళ్ల క్రితం 2019లో జరిగింది.
Exclusive pictures from Venkatesh daughter’s engagement.#venkatesh #maheshbabu #chiranjeevi #Nagachaitanya #Ranadaggubati pic.twitter.com/t1JlipljzS
— Pooja Suniramana (@PoojaSuniramana) October 26, 2023