చేనేత కార్మికుల సమస్యలు, కష్టనష్టాలను చర్చిస్తూ రూపొందించిన చిత్రం ‘ది అవార్డ్ 1996’. భూదాన్ పోచంపల్లికి చెందిన బడుగు విజయ్ కుమార్ దర్శకత్వం వహించారు. చిరందాసు ధనుంజయ్ నిర్మాత. త్వరలో విడుదలకానుంది. సోమవారం ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఈ సినిమా ద్వారా చేనేత కార్మికుల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘యథార్థ సంఘటలన ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చేనేత కార్మికుల జీవితానికి అద్దం పడుతుంది. త్వరలో ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తాం’ అన్నారు. శివరామ్ రెడ్డి, సాయిచందన జంటగా నటించిన ఈ చిత్రానికి కెమెరా: లింగా గౌడ్, సంగీతం: ప్రశాంత్ మార్క్, దర్శకత్వం: బడుగు విజయ్ కుమార్.