Kaantha Movie Promotions | దుల్కర్ సల్మాన్, సముద్రఖని, దగ్గుబాటి రానా, భాగ్యశ్రీ భోర్సే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం కాంతా. ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌లో పాల్గోంటుంది చిత్రయూనిట్. అయితే ఈ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. నటుడు రానా దగ్గుబాటి. కాంతా సినిమా రెట్రో స్టైల్లో వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా సాంకేతిక అంశాలపై మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిన పాత క్లాసిక్ సినిమాలకు ఉపయోగించిన కెమెరానే ‘కాంతా’ చిత్రీకరణకు వాడినట్లు రానా తెలిపారు.
‘కాంతా’ కోసం ఉపయోగించిన కెమెరాకు గొప్ప చరిత్ర ఉంది. అది కేవలం పాత కెమెరా కాదు, తెలుగు సినిమా గర్వించదగిన క్లాసిక్స్ అయిన ‘మాయాబజార్’, ‘పాతాళ భైరవి’ వంటి గొప్ప చిత్రాల చిత్రీకరణకు ఉపయోగించిన మిచెల్ కెమెరా. ఈ కెమెరానే కాంతా కోసం వాడాం అంటూ రానా చెప్పుకోచ్చాడు. అంతేగాకుండా ఈ సినిమాలో వాడిన ప్రతి కారు కూడా దుల్కర్ చాలా దగ్గరుండి సెలెక్ట్ చేశాడు. కొత్త కారు తీసుకువస్తే.. ఆ ఇయర్లో ఆ మోడల్ విడుదల కాలేదంటూ వాదించేవాడంటూ రానా తెలిపాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
“The camera that was used in the movies Pathala Bhairavi and Mayabazar… We used the same camera for the film Kaantha as well.#RanaDaggubati“pic.twitter.com/eaUqi2fG7X
— Filmy Bowl (@FilmyBowl) November 11, 2025